వైఎస్ జగన్ డిశ్చార్జ్..!

ఆస్పత్రి వద్దకు భారీగా వచ్చిన ప్రజలు..!
చిరునవ్వుతో అభివాదం..!

గుంటూరుః ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైఎస్ జగన్ ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. బయటకు వస్తూనే వైఎస్ జగన్ చిరునవ్వుతో ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. 

కుదుటపడుతున్న ఆరోగ్యం..!
వైఎస్ జగన్ ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతోందని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. కీటోన్ బాడీస్ అదుపులోకి వచ్చినట్లు ప్రకటించారు. ఐతే, యూరిక్ ఆసిడ్ లెవల్స్  ఇంకా తగ్గాల్సి ఉందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సాలిడ్ ఫుడ్ తీసుకుంటున్నందున మెల్లగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు..బిపి 120/80, పల్స్ 86, బ్లడ్ షుగర్ 109, బరువు 72 కేజీలున్నట్లు వైద్యులు వెల్లడించారు. 

ఐసీయూలో చికిత్స..!
నిద్రాహారాలు మాని ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఐతే, దీక్ష ఏడోరోజుకు చేరుకున్న సందర్భంలో చంద్రబాబు చీకట్లో దొంగదారిన పోలీసులను పంపించి మంగళవారం ఉదయం 4.11 గంటలకు దీక్షను భగ్నం చేశాడు. బలవంతంగా వైఎస్ జగన్ ను 108 లో జీజీహెచ్ కు తరలించారు.  వైఎస్ జగన్ వైద్యాన్ని నిరాకరించినా వినకుండా వైద్యులు ఫ్లూయిడ్స్  ఎక్కించారు. జననేత ఆరోగ్యం బాగా క్షీణించినందుకు 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. ఐసీయూలో ఉంచి రెండ్రోజులుగా చికిత్స అందించారు. 

తాజా ఫోటోలు

Back to Top