'కాంగ్రెస్‌‌తో విభేదించాకే నాపై కేసులు'

హైదరాబాద్: ‘‘రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి మొన్నటిదాకా చాలా మంచివాళ్లు. కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ మంచివాళ్లే. కాంగ్రెస్‌ను వీడి, సొంత పార్టీ పెట్టాక జగన్ అవినీతిపరుడయ్యాడా?’’ అని జగన్ ప్రశ్నించారు. మీ అదృష్టం బాగుండి బయటపడ్డారని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాలవల్ల కోర్టు చంద్రబాబు కేసును స్వీకరించలేకపోయిందని, లేదంటే  బాబు పరిస్థితేంటో అందరికీ తెలుసన్నారు. రాజకీయంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఇలాంటి ఇబ్బందులు తమకేమీ కొత్త కాదని చెప్పారు. ప్రజలకిచ్చిన ఒక మాటకోసం సోనియాగాంధీతోనే విభేదించాను.. ఇచ్చిన మాటకోసం సోనియాగాంధీ, చంద్రబాబు.. ఇంకా ఎవరితోనైనా పోరాడతామని జగన్ పేర్కొన్నారు.  
Back to Top