శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

అనంతపురం: రైతులకు అండగా ఉంటామని, వారిలో స్థైర్యం నింపేందుకు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది.  ఆయన బుధవారం మూడో రోజు రైతు భరోసా యాత్రను గుత్తి నుంచి ప్రారంభించారు. ఆయన గుంతకల్ నియోజకవర్గంలోని లక్తానుపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసాయిచ్చారు. శ్రీకాంత్ రెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జగన్ సూచించారు.
Back to Top