పర్వతారోహకుడు మస్తాన్బాబు కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్

నెల్లూరు: పర్వతారోహకుడు, ఇటీవలే అర్జెంటీనాలో మృతిచెందిన తెలుగుతేజం మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం నెల్లూరు జిల్లా గాంధీసంగంకు చేరుకున్న ఆయన.. మస్తాన్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులను  ఓదార్చారు.

వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించినవారిలో ఉన్నారు. పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న మస్తాన్ బాబు.. కొద్ది రోజుల క్రితం ఆండీస్ పర్వతశ్రేణుల్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహం స్వస్థలానికి రావాల్సిఉంది.

తాజా వీడియోలు

Back to Top