హైదరాబాద్: ముష్కరుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్య కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కామినేని ఆస్పత్రి వైద్యులను అడిగి సిద్ధయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిపై కామినేని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎస్ఐ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు చెప్పారు. వైద్యానికి ఆయన ఆరోగ్యం సహకరించటం లేదన్నారు. అదే ఆసుపత్రిలో చికిత్స మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధయ్య సతీమణి ధరణిషను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. <iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/5l0hY_TLs-M" frameborder="0"/>