ఎన్‌డీ తివారీ మృతి పట్ల వైయస్‌ జగన్‌ సంతాపం

విజయనగరం: సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌దత్‌ తివారీ మృతి పట్ల వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశంలో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సీనియర్‌ రాజకీయ నాయకుడు ఎన్‌డీ తివారీ  ఒక్కరేనని వైయస్‌ జగన్‌ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్‌ కూడా అయిన తివారీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్‌డీ తివారీ కుటుంబ సభ్యులకు వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top