వైయస్‌ జగన్‌ గెలుపే ధ్యేయంగా శ్రమిస్తాం..

చంద్రబాబు హామీలతో మోసపోయాం..
టీడీపీ పాలనపై మండిపడ్డ మహిళలు
విజయనగరంః చంద్రబాబు హామీలతో మోసపోయామని కెంగువ మహిళలు మండిపడ్డారు. మహిళలు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని జననేత ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడారు. వైయస్‌ జగన్‌  మాటపై నిలబడే నేత అని, జగన్‌ అడుగుజాడల్లో నడిచి ఆయనకు తోడుగా ఉంటామన్నారు. రాజన్న బిడ్డ వస్తే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. తమ గ్రామంలో రోడ్లు, బస్సు  సౌకర్యం లేదన్నారు. ఆసుపత్రి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. పాఠశాల కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top