పాపాయికి వైయస్‌ జగన్‌ నామకరణం

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓ చంటి పాపాయికి నామకరణం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం ఆలూరు నియోజకవర్గం కారుమంచి గ్రామంలో అస్పరికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మిథిలారెడ్డి దంపతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమ కుమార్తెకు పేరు పెట్టాలని కోరారు. వెంటనే స్పందించిన వైయస్‌ జగన్‌ పాపాయికి ‘రేయన్ష’ నామకరణం చేసి ఆశీర్వదించారు. కొంత సేపు బుజ్జాయి ఎత్తుకొని ముద్దాడారు.lతమ బిడ్డకు జననేత పేరు పెట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
 
Back to Top