వెయస్‌ జగన్‌ వ్యక్తిత్వమే మన అస్తి– తిరుపతిలో ఘనంగా వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు
చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వమే మన రాజకీయ ఆస్తి అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి భారీ కేక్‌ కట్‌చేసి వైయస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలు మన నాయకుడిని విమర్శించినంతగా దేశంలో మరే నాయకుడిని విమర్శించిన సందర్భాలు లేవన్నారు. ఇంతగా విమర్శలు చేస్తున్నా, మన నాయకుడి వ్యక్తిత్వంపై అకారణంగా మోసపూరిత కుట్రలు చేసినా, ఏ తప్పు చేయని వ్యక్తిని ఏడాదిన్నర పాటు జైలుకు పంపించినా, సడలని సంకల్పంతో తండ్రి ఆశయ సాధన కోసం, ప్రజలకు భద్రత కల్పించేందుకు అహర్నిçశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఆయన చేసిన ఉద్యమాలు ఏ నాయకుడు చేయలేదన్నారు.  ఏ సినీ గ్లామర్‌ లేకపోయినా, కుట్రలు కుతంత్రాలు చేసినా ఇంతగా వైయస్‌ఆర్‌సీపీని ముందుకు నడిపిస్తున్న యోధుడు వైయస్‌ జగన్‌ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ అత్యధిక సీట్లలో గెలువబోతుందన్నారు. ఇంతగా ప్రజాధరణ కలిగిన మన నాయకుడి పుట్టిన రోజు కేవలం మన కార్యకర్తలకే కాకుండా ప్రజలందరికీ పండుగ రోజు అన్నారు. ఊరూ వాడా  ప్రతి చోట ఘనంగా వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు.
 
Back to Top