వైఎస్ అవినాష్ రెడ్డి రక్తదానం

జమ్మలమడుగు: వైఎస్ జగన్
జన్మదినం సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రక్తదానం చేశారు.
స్థానిక సీఎస్‌ఐ కాంప్‌బెల్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఎంపీతోపాటు
వందలాదిగా కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. పులివెందులలో పార్టీ
నాయకులు పలు సాంఘిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని ఆలయాల్లో
ప్రత్యేక పూజలు చేశారు. ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్లు, పాలు పంపిణీ
చేశారు. పార్టీ నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దీంతోపాటు స్థానిక గాయత్రి వృద్ధ శరణాలయం, జ్యోతి మనోవికాస కేంద్రంలో
వృద్ధులు, పిల్లలకు దుప్పట్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసి, అన్నదానం
చేశారు.
Back to Top