ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదన్నా..

గుంటూరు: ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. చదివిన డిగ్రీలతో రోడ్లు పట్టుకొని తిరుగుతున్నామని నిరుద్యోగ యువతి వైయస్‌ జగన్‌కు తమ సమస్యను చెప్పుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పొన్నూరులో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నిరుద్యోగ యువత కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యకు చెప్పుకున్నారు. ఉద్యోగం రాని యువతకు నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మొదటి నుంచి వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని, జగనన్న వస్తేనే.. ప్రత్యేక హోదా వస్తుందన్నారు. టెట్‌ అనే పరీక్షను మూడుసార్లు పోస్టుపోన్‌ చేసిందని, అంటే టెట్‌ అనే పరీక్షను కూడా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top