<strong><br/></strong><strong>జననేత ముందు గోడు వెళ్లబోసుకున్న వైయస్‌ఆర్ నగర్ మహిళలు</strong>విజయనగరంః టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విజయనగరం వైయస్‌ఆర్ నగర్ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు.వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. నాన్నగారు హయాంలో ఇచ్చిన కాలనీ పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి చూపుతుందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వర్షం వస్తే కాలనీ అంతా మురుగుమయంగా మారుతుందన్నారు. నీరంతా నిలిచిపోయి నడవలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. రోడ్లు లేకపోవడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధుడే లేదన్నారు. అలాగే తాగునీరు సమస్య కూడా తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై పోరాటం చేస్తే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చెందిన వారికే పనులు చేస్తున్నారని, మిగతావారిని పట్టించుకోవడంలేదన్నారు. జననేత వైయస్ జగన్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని మహిళలు అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలిచి దివంగత మహానేత వైయస్‌ఆర్ పాలనకు మించి మాకు మేలు చేస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నామన్నారు. <br/>