మహిళలకు రక్షణ లేదు..!

 విజయవాడ) ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని తహశీల్దార్
వనజాక్షి వాపోయారు. ఆమె మీద పట్టపగలు తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి
దాడి చేయించి, ఆమెను జుట్టుపట్టి పక్కకు ఈడ్చేస్తే పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఇంతకంటే
దారుణం మరొకటి ఉండదని ఆమె బోరుమన్నారు.

 ఈలోగా చింతమనేని కుట్ర చేసి, ఆమె వ్యక్తిగత జీవితం
మీద దుష్ర్పచారానికి పూనుకోవటంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఒక మహిళను కించపరిచేలా
ప్రయత్నించటం దారుణమని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇలా అయితే మహిళా ఉద్యోగులు ఎవ్వరూ
బతకరని, ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే అని ఆమె వాపోయారు. 

Back to Top