జన్మభూమి కమిటీలదే ఇష్టారాజ్యం..వైయస్ఆర్సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్
శ్రీకాకుళంఃఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్ అన్నారు. చదువుకున్నవారికి ఉద్యోగాలు లేవన్నారు. నిరుద్యోగ భృతికూడా అందడంలేదన్నారు.జన్మభూమి కమిటీల పేరుతో భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు.రేషన్‌కార్డులు,ఇళ్లు, పింఛన్లు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం అందక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగుల్ని చంద్రబాబు మోసం చేశారన్నారు. దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో అందరికి సంక్షేమ పథకాలు అందాయన్నారు.టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజలందరూ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకువస్తున్నారన్నారు.