దొంగసొత్తుని సభలోకి ఆహ్వానిస్తారా?

విజయవాడలో కొత్త అసెంబ్లీ తాత్కాలిక భవనాలను ప్రారంభించే సమయంలో వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ స్పీకర్ కు ఓ బహిరంగ లేఖను రాశారు.  దీన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు విడుదల చేశారు. దొంగ సొత్తుతో దేవాలయమైన అసెంబ్లీలో ప్రవేశిస్తారా అని వైయస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో తెలంగాణలో ఎమ్మెల్యేలలను కొంటూ దొంగతనం చేశారు. మా పార్టీకి చెందిన 21 ఎమ్మెల్యేలకు కండువాలు కప్పారు. ఇందుకోసం వందల కోట్లు వెచ్చించి మరో దొంగతనం చేశారు. 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం దొంగసొత్తేనని, వారిని సభలోకి ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.

Back to Top