శ్రీకాకుళంః దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అక్రమాలు, అవినీతికి చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిందని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. నరసన్న పేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి వక్రమార్గంలో టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం లక్ష 25 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని అప్పుల్లో శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. జిల్లా ప్రజల ఆక్షాంక్ష మేరకు వైయస్‌ఆర్ ప్రారంభించిన వంశధార ప్రాజెక్టు అన్ని కోర్డు వివాదాలు అధిగమించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఒక బ్యారేజ్ కూడా నిర్మించలేదన్నారు. రాష్ట్రంలో అత్యంత అల్పదాయం కలిగిన జిల్లా శ్రీకాకుళం జిల్లాకు సాయం చేయాలని శ్రీకృష్ణ కమిటి నివేదిక ఇచ్చిందన్నారు.13 జిల్లాలకు 12 కేంద్ర సంస్థలు ఇచ్చారని అందులో ఒక్కటైన శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చారా అని ప్రశ్నించారు. జిల్లా వివక్షతకు గురవుతుందన్నారు.అభివృద్ధి చెందిన జిల్లాల సరసన శ్రీకాకుళం జిల్లా ఉండాలని ప్రజలు కోరుకోవడం తప్పా అని ప్రశ్నించారు. వంశధారలో ఇసుక అమ్ముకున్నారు తప్ప టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. నీరు– చెట్టు పేరుతో ప్రజల సోమ్మును దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మన జిల్లా అభివృద్ధి చెందాలంటే వైయస్ జగన్‌ను సీఎం చేయాలన్నారు. మన భవిష్యత్ తరాలు బాగులంటే వైయస్‌ఆర్‌సీసీ అధికారంలోకి రావాలన్నారు.