<p style="text-align:justify">హైదరాబాద్ :వైయస్సార్సీపీ నుంచి ప్రలోభాలకు లోనై తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా అని వైయస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఫిరాయించడం అనేది పూర్తిగా అనైతికమని ఆయన అన్నారు. వారంతా తమ తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేసి నెగ్గాలని ఆయన సూచించారు. ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. <p style="text-align:justify"> 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చనపుడు అభివృద్ధి ఎక్కడ జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నామని చెబుతున్న ఎమ్మెల్యేలు నిజంగానే అభివృద్ధిని చూసి చేరారా? లేక స్వీయ ప్రయోజనాల కోసమా? అనేది చెప్పాలని మిథున్ డిమాండ్ చేశారు. జగన్ పేరుతో, వైఎస్సార్‌సీపీ గుర్తుపై ఎన్నికైన వారు తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలన్నారు.</p></p>