మరిగిన రక్తం ఏమైంది బాబూ..!

హైదరాబాద్))
ప్రత్యేక హోదా మీద కేంద్రం వైఖరి చూసి రక్తం మరిగిపోయిందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ
ఆవేశం అంతా ఏమైందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన
కరుణాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర
కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశంలోనే అత్యంత
ధనవంతుడైన మంత్రి ఏపీలో ఉన్నాడని, ఇద్దరు క్రిమినల్స్ కూడా చంద్రబాబు
మంత్రివర్గంలో ఉన్నారని భూమన చెప్పారు.  బాబుకు ఇష్టసఖులైన దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు క్రిమినల్స్
అని చాలా స్పష్టంగా నివేదికలో వచ్చిందని గుర్తు చేశారు.

 మహిళల జీవిత అభ్యున్నతికి కృషి
చేయకుండా...డ్వాక్రా రుణాలు ఏమైపోయాయో, మహిళా శాసనసభ్యురాలిని సభ నుంచి కూడా
గెంటివేయించి దుశ్సాసనతో సభను నింపిన చరిత్రగా బాబు పాలన మిగిలిపోతోందని చెప్పారు

చంద్రబాబు నాయుడు
స్వయంగా పుష్కరాలకు ఆహ్వానం కోసమే ఢిల్లీకి వచ్చానని చెప్పడం సిగ్గుచేటని భూమన
ఆక్షేపించారు. ఈ పొగడ్తల మీద ఉన్న శ్రద్ధ, ప్రత్యేక హోదా మీద లేదని ఆయన
విశ్లేషించారు.     రక్తం మరిగిపోయిందన్న చంద్రబాబు.. తెలుగువారి
ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టుపెట్టి   నిర్వీర్యం చేశారని భూమన మండిపడ్డారు. మహాత్ముని
విగ్రహాన్ని ధ్వంసం చేసి మరోసారి గాడ్సే వారసులు అనిపించుకొన్నారని పేర్కొన్నారు.

 

Back to Top