చంద్రబాబుకు ఏ శిక్ష వేయాలి..?

  • మీరు మనుషులా.. వేస్ట్‌ వేధవలు
  • కుట్రలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు
  • ఉన్మాదానికి ప్యాంటు, షర్టు వేస్తే అది చంద్రబాబు
  • రోజాకు చనిపోయిందంటూ శ్రద్ధాంజలి పెడతారా..?
  • తప్పు మీద తప్పు చేస్తున్న సీఎంకు ఏం శిక్ష వేయాలి
  • రాయలసీమ ప్రజలను అవమానించడం వాస్తవమా.. కాదా..?
  • రావణుడు, ఔరంగజేబు, గాడ్సే కంటే బాబు నీచుడని ఎన్టీఆర్‌ చెప్పారు?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, గుంట నక్క, ఊసరవెల్లి అనేందుకు బాబుకే పేటెంట్‌ రైట్స్‌ ఉన్నాయని రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. గత 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు రాయలసీమను ఏ విధంగా మోసచేశారో... మళ్లీ మూడేళ్లుగా ఎలా సర్వనాశనం చేస్తున్నారో నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని ఆమె తెలిపారు. రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసాలపై ఆమె మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీ కెనాలకు తుంగభద్ర నుంచి నీరు సరిగ్గా సరఫరా కాకపోవడంతో ఆయకట్టు ప్రజలు స్థిరీకరణ కావాలని కోరుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని వైయస్‌ జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. కానీ చంద్రబాబు అది అవసరమా అని మాట్లాడుతున్నారన్నారు. రాయలసీమకు తాగునీరు సరఫరా కావాలంటే వెలుగొండ ద్వారా శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుు ఉండాలని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నిర్ణయించారన్నారు. కానీ శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులకు తీసుకెళ్లే విధంగా జీఓ ఇచ్చి రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమకు నీరు ఇవ్వాలనే ఆలోచనతో వైయస్‌ఆర్‌ కృషి చేస్తే దేవినేని ఉమా దాన్ని వ్యతిరేకించింది నిజం కాదా నిలదీశారు. వైయస్‌ఆర్‌పై కృష్ణా డెల్టా రైతులను రెచ్చగొట్టింది దేవినేని కాదా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి నేడు సీమకు నీరు ఇస్తారంటే అందరూ నవ్విపోతున్నారన్నారు. 
 
వైయస్‌ఆర్‌ చొరవవల్లే సీమకు నీళ్లు
వైయస్‌ఆర్‌ చొరవ వల్లే రాయలసీమకు అంతో ఇంతో నీరు వస్తుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచింన ఘనత వైయస్‌ఆర్‌దన్నారు. దాన్ని కూడా టీడీపీ నేతలు వ్యతిరేకించారన్నారు.  విభజన తరువాత కేంద్రీయ విశ్వవిద్యాలయం నంద్యాలకు వస్తే దాన్ని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎక్కడో గోదావరిలో రైలు తగలబెడితే అది రాయలసీమ గుండాల పనేనని అవమానించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాను అన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు తన కేబినెట్‌ను అక్కడ కూర్చోబెట్టి ఇళ్లు, రోడ్లు విస్తరణ అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నంద్యాల ప్రజలు టీడీపీ ఏం చెబితే అది నమ్మడానికి అమాయకులు కాదని, మీ అన్యాయాన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. 

తండ్రిని చంపిన ఔరంగజేబు, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచమైన వ్యక్తి చంద్రబాబు అని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ స్వయంగా చెప్పాక ఎవరెన్ని చెప్పినా తక్కువే అవుతుందని రోజా ఎద్దేవా చేశారు. 600ల హామీలు ఇచ్చి అందరిని మోసం చేస్తున్న చంద్రబాబు లాంటి వ్యక్తిని నంద్యాల ఓటర్లు జడ్జి స్థానంలో కూర్చొని ఉరితీయాలని చెప్పినా తప్పేలేదని ప్రతిపక్షనేత అనడం తప్పా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి కోర్టులో జడ్జీ తీర్పు ఇస్తే.. ప్రజా కోర్టులో ప్రజలే తీర్పులు ఇస్తారన్నారు. 

1,240 మంది రైతు ఆత్మహత్యలకు బాబే కారణం...
తన పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని చంపిన చంద్రబాబుకు ఏం శిక్ష వేయాలో టీడీపీ నేతలు చెప్పాలని రోజా ప్రశ్నించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో కాలనాగులకు అండగా ఉన్న చంద్రబాబును ఏం చేయాలి. రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కొని వారిని రోడ్డుమీద పడేసిన వారిని ఏం చేయాలో చెప్పాలన్నారు. అదే విధంగా  ఆడపిల్లలను చంపేస్తున్న నారాయణ కళాశాలకు ఏ శిక్ష వేయాలన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసి రాష్ట్రంలో 1,240 మంది రైతు ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబును ఏం చేయాలన్నారు. చిన్న పిల్లల నుంని కాటికి కాళ్లు చాపిన పండు ముసలి వారి వరకు అందరినీ సర్వనాశనం చేసిన బాబు పాలనను ప్రజా కోర్టులో ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. పట్టపగలు డిప్యూటీ సీఎం కొడుకు రాజకీయం కోసం ప్రత్తికొండలో వైయస్‌ఆర్‌ సీపీ నేతను పబ్లిక్‌గా చంపించిన కేసులో చంద్రబాబుకు ఏం శిక్ష వేయాలన్నారు. 1995లో ఎన్టీఆర్‌ పక్కనే ఉంటూ ఆయనకు వెన్నుపోటు పొడిచి 2009లో మీరు ఫినిష్‌ అవుతారని చెప్పే వరకు చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ తన కేసుల నుంచి తప్పించుకోవడానికి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని మెజార్టీ లేని కిరణ్‌ సర్కార్‌ను కాపాడుతూ వచ్చాడన్నారు. ఆ తరువాత సోనియాతో చేతులు కలిపి వైయస్‌ జగన్‌ను 16 నెలలు జైలుకు పంపిన బాబు కుట్రను ప్రజలంతా అర్థం చేసుకున్నారు. 
 
ఆడ పుట్టుకను అవమానించిన బాబే గొప్ప నేతా మీకు..?
చంద్రబాబు కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడ పుట్టుకనే విభేదిస్తే పచ్చ మహిళలకు విభేదాలు ఉండవు. బాలకృష్ణ ఆడపిల్ల కనిపిస్తే కడుపు చేయండి కమిట్‌ అయిపోండీ అని మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మహిళా నేతలకు గొప్పగా కనిపిస్తారా అని ప్రశ్నించారు. కారు షెడ్‌లో ఉండాలి.. ఆడది ఇంట్లో ఉండాలని అని స్పీకర్‌ మాట్లాడితే ఆయనకు మహిళా పార్లమెంట్‌ సదస్సులో సన్మానాలు చేసి రంగు రంగు చీరలు కట్టుకోవడంలోనే మీ చిత్తశుద్ధి చూపించారన్నారు. కాల్‌మనీ గురించి ఆ సదస్సులో ఒక్కసారైనా మాట్లాడారా అని టీడీపీ మహిళా ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. రోజా చనిపోయిందంటూ కొందరు వేస్ట్ వెధవలు శ్రద్ధాంజలి పెడుతున్నారని..వీళ్లు అసలు మనుషులేనా అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాయకుడు చేస్తున్న తప్పులను నిలదీస్తే కోపమా.. మా నాయకుడు ప్రజలే జడ్జీలుగా ఓ తీర్పు ఇవ్వాలని మాట్లాడితే తప్పా.. ? మీరు మనుషులా.. ఉన్మాదులు.. ఉన్మాదికి ప్యాంటు, షర్టు వేస్తే చంద్రబాబు అని ఆరోపించారు. ఉన్మాది పార్టీలో ఉంటూ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నంద్యాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తి మా దేశంలో ఉంటే మెంటల్‌ ఆసుపత్రికైనా, జైలుకైనా పంపిస్తామని స్విస్‌ ఆర్థికమంత్రి అన్నారని గుర్తు చేశారు. 
Back to Top