<p style="" margin-top:0in=""><strong>ఢిల్లీలో ప్రారంభమైన గర్జన దీక్ష</strong><p style="" margin-top:0in=""><strong>న్యూఢిల్లీ</strong> : ప్రత్యేక హోదా సాధనకు తుదివరకు పోరాడతామంటూ ప్రకటించిన వైయస్ఆర్ కాంగ్రెస్ ఆ మేరకు ఢిల్లీ వేదికగా మరో ఆందోళన చేపట్టింది. వంచన పై గర్జన పేరుతో ఒకరోజు నిరసన దీక్షను ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభించింది. మహానేత వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ నాయకులు దీక్షకు కూర్చున్నారు. ఈసందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూవిభజన సమయంలో పార్లమెంటులోనూ బయటా చర్చ జరిగిన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకరించారనీ, అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగున్నరేళ్లుగా బిజెపి, టీడీపీలు ఎందుకు సాధించలేకపోయారో చెప్పాలన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి నిరాహార దీక్షలు కూడా చేశారని,అప్పట్లో ప్రత్యేక హోదా గళం ఎత్తిన వారిపై పిడి యాక్టు కేసులు పెడతామంటూ ఉద్యమాన్ని అణిచి వేసే చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడ్డారన్నారు. ఇప్పుడు తాజాగా ఆయన యూటర్నులు తీసుకుని హోదా కావాలంటున్నారని విమర్శించారు. వ్యవసాయరంగాన్ని కుదేలుచేసి, వలసలు వెళుతున్నది అదనపు సంపాదనకే అంటూ ముక్తాయింపు ఇవ్వడం ఆయన నైజానికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు పార్టీ తరపున అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.</p></p>