వైయ‌స్ఆర్‌సీపీని బ‌లోపేతం చేద్దాం

సాలూరు: గ‌్రామ స్థాయిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామ‌ని పార్టీ మండలాధ్యక్షుడు సువ్వాడ రమణ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రాజన్నదొర ఇంటి వద్ద వైయ‌స్ఆర్ కుటుంబ కార్యక్రమ సామాగ్రిని మామిడిపల్లి, మావుడి, తోణాం తదితర సుమారు 15 పంచాయ‌తీల‌ బూత్‌ కన్వీనర్‌లకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించడంలో పూర్తిగా విఫలమైన టీడీపీ.ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వైయ‌స్ఆర్ కుటుంబ కార్యక్రమంలో భాగంగా ప్ర‌తి ఇంటికి వెళ్లి నవరత్నాలు పథ‌కాల గురించి వివ‌రించాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రిని వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర్పించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో మండ‌ల కార్యదర్శి దండి శ్రీనువాసరావు,సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top