సామాన్యుల రాజధాని కావాలి..శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్
ప్రజలకు సామాన్యుల రాజధాని కావాలని వైయస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీకాంత్
రెడ్డి కోరారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతసేపు కోట్ల రూపాయిల
ఒప్పందాలు అంటూ గ్రాఫిక్ బొమ్మలు చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి కోతలు
సమంజసం కాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో
టీడీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోందని ఆయన అన్నారు. ఈ స్థాయిలో హంగు
ఆర్భాటాలు అవసరమా? అని
ప్రశ్నించారు.  అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానా లేక సింగపూర్‑కు రాజధానా? అంటూ ధ్వజమెత్తారు.ఆంధ్రప్రదేశ్ కు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న ఎమ్‑ఓయూ
లు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Back to Top