తామంతా జననేత వెంటే

హిందూపురం అర్బన్‌ : జన సంక్షేమం కోసం నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ వెంట నడవాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తున్నారు. తామంతా వైయస్‌ జగన్‌ అడుగుజాడల్లోనే నడుస్తామని అనంతపురం జిల్లా చౌళూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన యువత నినదించారు. పోచనపల్లిలో హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ చౌళూరుకు చెందిన సుబ్బరాయప్ప, నరసింహప్ప, వెంకన్న, యువకులు సాయి నరసింహప్ప, మంజు, ఆశ్వర్థ, బుజ్జి, నవీన్, ప్రవీన్, మరో 30 మంది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

వారికి నవీన్‌నిశ్చల్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీసీ సెల్‌ రాము, చౌళూరు రవికుమార్, బీ బ్లాక్‌ కన్వీనర్‌ మల్లికార్జున, కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి, విద్యార్థి నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top