<br/><br/> వైయస్ఆర్ జిల్లా : వైయస్ఆర్ జిల్లా చిన‍్నమండెం మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ ముంపు బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించలని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి డిమాండు చేశారు. శనివారం అర్ధరాత్రి రిజర్వాయర్‌కు గండిపడి పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ స్థంభాలు నేల వాలాయి. ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. ఈ క్రమంలో ముందు బాధితులను వైయస్ఆర్‌సీపీ నాయకులు పరామర్శించారు. బాధితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు పడినా ఎప్పుడు గండి పడలేదని, ప్రాజెక్టుకు వర్షాలు లేని సమయంలో గండి పడటం ఏంటని ప్రశ్నించారు. పునరావాసం చూపకుండా నీటిని విడుదల చేయడం ఏంటని మండిపడ్డారు.