వైఎస్సార్సీపీకి వరంగల్ ఓటర్ల దీవెనలు..!

రాజన్న రాజ్యంతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వాసం..!
నల్లా సూర్యప్రకాష్ గెలుపే లక్ష్యంగా ప్రచారం..!

వరంగల్ః  ఓరుగల్లులో వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.  వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రచారంలో  ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.  రాజశేఖర్ రెడ్డి వరంగల్ కు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలంటే  రాజన్న రాజ్యంతోనే సాధ్యమని వరంగల్ ఓటర్లు విశ్వసిస్తున్నారు. ఈక్రమంలోనే వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రచారానికి భారీగా తరలివచ్చి మద్దతుగా నిలుస్తున్నారు. తమ దీవెనలు అందజేస్తున్నారు.

పేదల పెన్నిధి..!
వరంగల్ జిల్లాలో వైఎస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. పెద్ద ఎత్తున యువకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.  ఉచిత విద్యుత్, పీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, 108,104 సహా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్. రాజశేఖర్ రెడ్డి అని ప్రజలు కొనియాడుతున్నారు. పేదల పెన్నిధి వైఎస్సార్ అంటూ నినదిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని తేల్చిచెబుతున్నారు.

వైఎస్సార్సీపీని గెలిపిస్తాం..!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకపోగా మాయమాటలతో మోసగిస్తున్నారని మండిపడుతున్నారు.  వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వచ్చిన  ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆతర్వాత వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రులు ...సంక్షేమ పథకాలను పూర్తిగా తుంగలో తొక్కేశారని నిప్పులు చెరుగుతున్నారు. తాము బాగుపడాలంటే అది రాజన్న రాజ్యంతోనే సాధ్యమని భావిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడించి......వైఎస్సార్సీపీని గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 
Back to Top