పేకమేడలు కడుతున్న ప్రభుత్వాలకు బుద్ధిచెప్పండి..!

మీ రాజన్న తనయుడిని ఆశీర్వదించండి
నల్లా సూర్యప్రకాష్ ను గెలిపించండి
ఫ్యాన్ గుర్తుకే మన ఓటు

వరంగల్ః
 ఓరుగల్లు ఉపఎన్నిక ప్రచారంలో  వైఎస్సార్సీపీకి  ప్రజలు బ్రహ్మరథం
పడుతున్నారని  ఎమ్మెల్యే రోజా అన్నారు.  ప్రతి గ్రామంలో ప్రజల నుంచి
వైఎస్సార్సీపీకి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు.  దివంగత ముఖ్యమంత్రి
వైఎస్. రాజశేఖర్ రెడ్డి  చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు
మర్చిపోలేకపోతున్నారని పేర్కొన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన నాయకుడు
వైఎస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. 

మాటల గారడీ..!
పంటలకు
గిట్టుబాటు ధర లేక, రుణాలు మాఫీ కాక రైతులు ఆత్మహత్యలు
చేసుకుంటుంటే...అధికారపార్టీలు వారిని పరామర్శించడం గానీ, ఎక్స్ గ్రేషియా
చెల్లించడం గానీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ వందల
అంతస్తులు కడతానంటూ కేసీఆర్ , సింగపూర్ కడతానంటూ చంద్రబాబు పేకమేడలు
కడుతున్నారు తప్ప పేదలకు ఇళ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. ఉమ్మడి
రాష్ట్రంలో  47 లక్షలకు పైగా ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్. రాజశేఖర్
రెడ్డిదని స్పష్టం చేశారు.  

కుట్ర రాజకీయాలు..!
వైఎస్సార్సీపీకి
ప్రజలు ఎక్కడ ఓటేస్తారన్న భయంతో కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని
కేసీఆర్ తో చేతులు కలుపుతున్నాయని రోజా ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో
దొంగలా దొరికిపోయిన టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ  రాజయ్య ఇంట్లో నలుగురు సజీవదహనమైన ఘటన అందరికీ
తెలిసిందేనన్నారు. ప్రజల గుండెల్లోంచి వైఎస్. రాజశేఖర్ రెడ్డిని ఎవరూ దూరం
చేయలేరని రోజా తేల్చిచెప్పారు. కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలకు ఈఉపఎన్నిక
ద్వారా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రోజా పిలుపునిచ్చారు. 

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు..!
తెలంగాణ
బిడ్డలు కోరుకున్న విధంగా పాలన ఉండాలంటే అది రాజన్న రాజ్యంతోనే సాధ్యమని
రోజా స్పష్టం చేశారు. మీకోసం కష్టపడే రాజన్న తనయుడు వైఎస్ జగన్ ను
ఆశీర్వదించి... రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీని
గెలిపించాలని వరంగల్ ఓటర్లను రోజా విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి
నల్లా సూర్యప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దళిత
ఉద్యమాల్లో అందరి కోసం కష్టపడిన మంచి మనిషిని వైఎస్ జగన్ ఓరుగల్లుకు
పంపించారని...ఆయన్ను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం
పోరాడతారని చెప్పారు. 
Back to Top