హంద్రీనీవాను నిర్లక్ష్యం చేయడం తగదు


అనంతపురం) రాయలసీమ కు నీటిని అందించే హంద్రీనీవా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయటం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి హితవు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీనిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా లో ఆయన మీడియాతో మాట్లాడారు. హంద్రీ నీవా పూర్తయితే కొంత మేరకు అయినా అనంతపురం జిల్లా లోని కరవు తీరుతుందని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. అయినప్పటకీ, ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవటం లేదన్నారు. హంద్రీనీవా సాధన కోసం రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 
Back to Top