'హంద్రీ నీవా ప్రాజెక్టు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు'

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టు పూర్తికావాలంటే ప్రభుత్వం నిధులివ్వాలి గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్లర్లకు హెచ్చరికలు చేస్తేనో లేదంటే కాల్వ గట్లపై నిద్ర చేస్తానంటేనో పనులు ముందుకు సాగుతాయా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్నట్టు హంద్రీ నీవా ప్రాజెక్టు కింద రైతులకు వచ్చే ఖరీఫ్ సీజనులో నీళ్లివ్వాలంటే రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉంటుందని చెప్పారు.

కనీసం రూ.400 కోట్లు ఖర్చు పెట్టినా రెండు లక్షల ఎకరాలకు నీటివసతి కల్పించవచ్చన్నారు. ఇందుకు నిధులు కేటాయించకుండా కాంట్రాక్టర్లను హెచ్చరించగానే పనులు మందుకు సాగవని చెప్పారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ఇంత ఆలస్యం కావడానికి కారణం చంద్రబాబేనన్నారు.  చంద్రబాబు తన పుట్టినరోజునాడైనా ప్రజలను కేవలం మాటలతో మభ్యపెట్టడం మాని ఆచరణలో చూపి ఉండాల్సిందని విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
Back to Top