వైయ‌స్ఆర్‌సీపీతోనే గ్రామాభివృద్ధి సాధ్యం

పాత కోటపాడు (రంగంపేట) :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు న‌ల్లా శ్రీ‌నివాస‌రావు అన్నారు. మండలంలో పాత కోటపాడు గ్రామంలో వైయ‌స్ఆర్ గ్రామ పార్టీ క‌న్వీన‌ర్ గ‌వ‌ర‌సాని రాజు ఆధ్వ‌ర్యంలో  శుక్రవారం నిర్వహించిన వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెర వేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ది చెప్పాలని, 100 అబద్దపు హామీలపై రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను పూర్తిగా చదివి, ప్రభుత్వానికి బుద్ది చెప్పేలా సరైన తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతీ ఓటరు పైన వుందాన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికే నిరంతరం శ్రమిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూపొందించిన నవ రత్నాలు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. గ్రామ బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరిని భాగస్వాముల్ని చేయాలన్నారు. ప్రతీ ఓటరు స్వచ్ఛంధంగా వైఎస్సార్‌ సీపీ లోకి చేరే విధంగా ఇప్పటి నుంచి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల న్నారు. రాజన్న రాజ్యం రావాలంటే, జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదల ఓటర్లకు వచ్చేలా అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

Back to Top