'వికలాంగుల పింఛను పెంపుదల వైయస్ ఘనత'

వరంగల్ జిల్లా:

రాష్ట్రంలో వికలాంగులకు రూ.500 వరకు పింఛను పెంచిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హన్మకొండలోని కాళోజీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 20వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, మహానేత జీవించి ఉంటే ఈపాటికి వికలాంగత్వ శాతాన్ని బట్టి పింఛన్ చెల్లింపు అమలులోకి వచ్చేదన్నారు. వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. వికలాంగుల పింఛన్‌ను రూ.2 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

Back to Top