విజయమ్మను కలిసిన వామపక్ష నేతలు

హైదరాబాద్, 28 మార్చి 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను వామపక్ష పార్టీల నాయకులు గురువారం కలిశారు. తాము చేస్తున్న విద్యుత్తు ఉద్యమానికి అండగా నిలవాలని వారు అభ్యర్థించారు. సీపీఎం నేత వై. వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకుడు అజీజ్ పాషా, ఆర్ఎస్‌పీ నేత జానకిరాములు ఆమెను కలిశారు. పెరిగిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని కోరుతూ పది వామపక్షాలు ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ప్రజా క్షేత్రంలో పోరాడాలని వారు నిర్ణయించుకున్నారు. వివిధ పార్టీలను తాము కలుస్తున్నామని చెప్పారు. కలిసి పనిచేస్తామని శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారని వారు చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డి.ఎ. సోమయాజులు, కొణతాల రామకృష్ణ కూడా విజయమ్మ వెంట ఉన్నారు.

Back to Top