విజయమ్మ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఫీజు రీయింబర్సుమెంటు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు పెల్లుబికింది. వివిధ ప్రాంతాలనుంచి విద్యార్థుల, వారి తల్లిదండ్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వెల్లువలా తరలివచ్చారు. దీక్షకు మద్దతుగా అనేక పట్టణాలలో ధర్నాలు, దీక్షలు కూడా చేపట్టారు.
ముల్కల్లలో రాస్తారోకో
ఆదిలాబాద్: ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తూముల నరేశ్ మాట్లాడుతూ  రీయింబర్సుమెంటు పూర్తిగా అందరికీ అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు వరుణ్‌రెడ్డి, నామాల రమేశ్, రాహుల్, మహేందర్, కుమార్‌యాదవ్, సాగర్, శరత్, సుదర్శన్, సురేశ్, ప్రసాద్, మహేందర్, అమిర్, కార్తీక్ పాల్గొన్నారు.
ఎస్‌కేయూలో విద్యర్థుల దీక్ష
అనంతపురం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కమిటీ (సీఈసీ) సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో చేపట్టిన రెండు రోజుల ‘ఫీజు దీక్ష’కు మద్దతుగా అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో విద్యార్థులు దీక్ష లో ఆయన ప్రసంగించారు.  రాప్తాడు నియోజకవర్గం ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. శింగనమల నియోజకవర్గ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి, కూడా మాట్లాడారు.  ఎస్కేయూ విద్యార్థి సంఘం నాయకుడు లింగారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన ద్వారం ముందు చేపట్టిన రిలే ని రాహార దీక్షలో లింగారెడ్డి, జయచంద్రారెడ్డి, ఎర్రిస్వామి, ఇఫ్తికర్, సోమశేఖర్, పార్థసారథిరెడ్డి, క్రిష్ణానాయక్, రవి, వికలాంగుడు ఎర్రిస్వామి కూర్చున్నారు. జిల్లాలోని ధర్మవరం, కళ్యాణదుర్గం, గుత్తి, పెనుకొండ, కుందుర్పిలో విద్యార్థులు దీక్షలు చేపట్టారు. ఉరవకొండలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కదిరిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకొని కూర్చుని గంట పాటు నిరసన వ్యక్తం చేశారు.  వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థి విభాగం విద్యార్థులు రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఫీజు రీయింబర్‌‌సమెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు.
ధర్మవరంలో రిలే దీక్షలు
ధర్మవరం: స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు రెడ్డివారి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సురేంద్రరెడ్డి, నాయకులు బడన్నపల్లి కేశవరెడ్డి, యూత్‌నియోజకవర్గ అధ్యక్షులు గొట్లూరు పోతిరెడ్డి ఈ దీక్షలను ప్రారంభించారు. ఓసీవిద్యార్థి సంఘం నాయకులు రంగారెడ్డి మద్దతు తెలిపారు. విద్యార్థి విభాగ్ జిల్లా అధ్యక్షుడు ఓబుళరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శివారెడ్డి, మండల కన్వీనర్ ఏలుకుంట్ల లక్ష్మినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి శేషాద్రిరెడ్డి, కోశాధికారి తిప్పేపల్లి ఓబిరెడ్డి, బీసీ సంఘం అధ్యక్షులు బొమ్మాహరి, ట్రేడ్ యూనియన్ పట్టణాధ్యక్షులు బీరే శ్రీరాములు, కాకి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
గుత్తిలో : రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంతకు ముందు గుత్తి మాజీ సర్పంచు హుసేన్ పీరా, దీక్షాపరులు వైఎస్సార్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను పీరా ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రవీణ్‌కుమార్‌యాదవ్, సీవీరంగారెడ్డి, సుభాష్‌రెడ్డి, మహిళా కన్వీనర్ శిరీషా,న్యాయవాది సుదీర్‌రెడ్డి, మండల మైనార్టీ సెల్ కన్వీనర్ మాజీ మలన్‌బాబా, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు సంఘీభావాన్ని ప్రకటించారు.
ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మద్దతు
వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు గేట్స్ కాలేజ్ యాజమాన్యం మద్దతు తెలిపింది. గేట్స్ కరస్పాండెంట్ వీకె సుధీర్‌రెడ్డి,పీడీ జోయెల్ విజయానందలు సంఘీభావం ప్రకటించారు.
క ళ్యాణదుర్గంలో ర్యాలీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పథకాలను నీరుగారిస్తే సహించేది లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. అంతకుముందు జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బీ.మచ్చన్న, మండల పార్టీ కన్వీనర్ తిరుమల వెంకటేశులు, పట్టణాధ్యక్షులు దాదాఖలందర్, గోళ్ళసూరి, ములకనూరు గోవిందు తదితరుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నివాళులర్పించారు.
ఉరవకొండలో ధర్నా: వైఎస్సార్ విద్యార్థి విభాగ్ నాయకులు గురువారం ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తొలుత ఎస్‌కే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో విద్యార్ధి విభాగ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆమిద్యాల నాగరాజు, కార్యదర్శి వెంటేష్ మాట్లాడారు. తహశీల్దార్ వుహేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. విద్యార్ధి విభాగ్ నాయుకులు వెంకట్‌రెడ్డి, పాల్తూరు నాగరాజు, జాన్‌బాబు, వుంజునాధ్‌రెడ్డి, జయుప్రకాష్, శ్రీధర్, పద్మరాగం, గోపాల్, కృష్ణవుూర్తి, యుువజన విభాగం నాయుకులు పాల్గొన్నారు.
కదిరిలో కళ్లకు గంతలతో నిరసన: మహానేత విగ్రహం వద్ద ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్షకు మద్దతు గా ఆందోళన చేపట్టినట్లు విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివ, నాయకులు పవన్‌గౌడ్, రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు ప్రసాద్, విష్ణు,లోక్‌నాధ్, రాజు, సతీష్, కవిత, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
కుందుర్పిలో.. వైఎస్సార్ సీపీ మండల నాయకులు గురువారం కుందుర్పిలో నిరసన దీక్ష చేపట్టారు. అంతకుముందు స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ పార్టీ మండల కన్వీనర్ ఎస్‌కే ఆంజినేయులు,యువజన కన్వీనర్ రాము, ఎస్సీసెల్ నాయకులు ఎన్ బాబు, కేఎన్‌రాజు,నాగన్న, వీ రామన్న తదితరులు మాట్లాడారు. ఫీజు పథకంలో నిబంధనలు సడలించి విద్యాభివృద్ధికి ప్రభుత్వ కృషి చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు బీకే ప్రభాకర్,శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.
శెట్టూరులో : విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు మద్దతుగా మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ విద్యా ర్థి విభాగం సంఘీభావం ప్రకటిస్తూ మండల అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్య ంలో నిరాహారదీక్షలు చేపట్టారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరాయుడు పార్టీ ఎస్‌సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లిం గప్ప, మైనారిటీ, బీసీ, యువజన నాయకులు సెం టుదాదా, తిప్పేస్వామి, కైరేవు జయన్న పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం
పెనుకొండ : ఫీజు రీయింబర్సుమెంటులో కోతకోసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. విజయమ్మ ఫీజుదీక్షకు మద్దతుగా నగరంలో ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ప్రవీణకుమార్, అరుణ్‌శేఖరరెడ్డి నేతృత్వంలో ఫీజు దీక్షను చేపట్టింది.
ముఖ్య అథితిగా పుట్టపర్తికి చెందిన నియోజవర్గ నాయకులు స్థానిక కమిటీలు, సభ్యత్వాల ఇన్‌చార్జి జె. హరికృష్ణ, మాజీ ఎంపీ గంగా దర్ సతీమణి సానిపల్లి మంగమ్మ, పెనుకొండ మాజీ ఎ మ్మెల్యే దివంగత రమణారెడ్డి సోదరీమణులు సానేఉమారాణి, సానేఉషారాణి, జిల్లా సభ్యులు జీవీపీ నా యుడు, సత్యనారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుదర్శనరెడ్డి, కన్వీనరు కాటిమ తిమ్మారెడ్డి, అత్తర్‌కదీర్ బాష, మునిమడుగు వెంకటరాముడు, శంకరరెడ్డి, నారాయణస్వామి, ప్రవీణ్, నాయుడు, జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకం: భూమన
తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజ మెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజ యమ్మ దీక్షకు మద్ధతుగా వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా శాఖ ఎస్వీయూలో నిరాహారదీక్షలు చేపట్టింది. ఈ దీక్షకు సంఘీభావంగా ఎస్వీయూలో విద్యార్థులు తరగతులు బహిష్కరించా రు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సందర్శించారు.  వైఎస్‌ఆర్ రెక్కల కష్టంతో ఏర్పాటైన ప్రభుత్వం క్రమంగానే వైఎస్‌ఆర్ ముద్రను చెరిపే కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్ సీపీ విద్యా ర్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎ.అజయ్‌కుమార్, విద్యార్థి నాయకులు ధనంజయరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షఫి అహ్మద్ ఖాద్రి, లీగల్ సెల్ జిల్లా చైర్మన్ యుగంధర్‌రెడ్డి, ముద్రనారాయణ, ఎస్‌కె బాబు, ఎంవీ ఎస్ మణి, చంద్రమౌళిరెడ్డి, టీఎస్‌ఎఫ్ నాయకులు అక్కులప్ప, బీవీ ఎఫ్ నాయకులు మురళి, గుణశేఖర్‌నాయుడు, లక్ష్మణకుమార్ పాల్గొన్నారు.
పోరును ఉద్ధృతం చేస్తాం
చంద్రగిరి: పేద విద్యార్థుల సౌకర్యార్థం మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌ని నిలిపేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఆ కుట్రను భగ్నం చేసేందుకు భవిష్యత్తులో ఫీజు పోరును ఉద్ధ­ృతం చేస్తామని చంద్రగిరిలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు హెచ్చరించారు. హైదరాబాదులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా చంద్రగిరి ఆ పార్టీ మండల నాయకులు తహశీల్దారు కార్యాలయం వద్ద మౌనం వహించి నిరసన వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం కాకుండా చూడాలని, ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌ను పూర్తిస్థారుులో అమలు చేయూలని తహశీల్దారు మనోహర్‌కు వినతి పత్రం అందించారు.  వైయస్‌ఆర్ సీపీ నాయకులు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి, చిల్లకూరి యుగంధర్‌రెడ్డి, ఎద్దుల చంద్రారెడ్డి, కృష్ణవేణమ్మ, శివశంకర్‌రెడ్డి, కుప్పారెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రభాకరరెడ్డి, సయ్యద్ షబ్బీర్, ఐ.చంద్రమౌళి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
కాకినాడ: పేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా మహానేత వై.యస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు గంపల వెంకటరమణ అన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు మద్దతుగా సర్పవరంలో జంక్షన్‌లో దీక్షలను ఆయన ప్రారంభించారు. మరో ముఖ్యఅతిథి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి అత్తిలి సీతారామస్వామి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేద, బడుగు, బలహీనవర్గాలు, గిరిజన, దళిత వర్గాలకు చెందిన విద్యార్థులు పెద్దచదువులు చదవలేక నిరాశ నిస్పృహలతో పెడదోవలు పడుతున్న సమయంలో వారిని దేశప్రగతిలో భాగస్వాములను చేయాలన్న ఉద్దేశ్యంతో స్వర్గీయ వైఎస్సార్ ఫీజురియింబర్స్‌మెంటు ప్రవేశపెట్టారన్నారు. ప్రచారశాఖ జిల్లా కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, చేనేత విభాగం కన్వీనర్ పంపన రామకృష్ణ, మండల కన్వీనర్ మంగం జాన్‌ప్రభుకుమార్, స్టీరింగ్ కమిటి సభ్యులు గుబ్బల వెంకటేశ్వరరావు, యనమదల గీతాదేవి, డాక్టర్ యనమదల మురళీకృష్ణలు మాట్లాడుతూ పేద విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఐక్యసంఘర్షణసమితి ఉపాధ్యక్షులు పెంకే వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ యువజనవిభాగం జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు లింగం రవి, కరప మండల కన్వీనర్ పబ్బినీడి పాపారావతదితరులు పాల్గొన్నారు. సుమారు 100 మంది విద్యార్థులు ఫీజుదీక్షలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
‘ఫీజు పోరు’కు తరలివెళ్లిన నేతలు
హైదరాబాద్: 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్సుమెంట్ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎంత వరకు సమంజసమని వైయస్సార్ కాం గ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు బీశ్వా రవీందర్ ప్రశ్నించారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ఫీజుపోరు దీక్షకు నిజాం కాలేజీ నుంచి విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్.  రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ర్యాలీలో శివప్రసాద్, వెంకటేష్, రమేష్, నవీన్, శ్రీధర్, మహేందర్, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఫీజు దీక్షకు సంఘీభావం
వైయస్ఆర్ కడప : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఫీజుదీక్షకు మద్దతుగా యోగివేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు సంఘీభావం తెలిపారు. పేద విద్యార్థుల ఫీజు కోసం చేపట్టిన దీక్షకు మద్దతుగా వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించారు. అనంతరం ర్యాలీగా వచ్చి మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా నాయకుడు అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వం మొద్దునిద్రను లేపడానికి విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు మద్దతు యోగివేమన విశ్వవిద్యాలయం విద్యార్థులం మద్దతుగా ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆ ఫెడరేషన్ నాయకులు నాగరాజు, బాలాజీనాయక్, శ్రీనివాసులు, రఘునాథరెడ్డి, రమేష్‌గౌడ్, అంకాల్, రాజశేఖరరెడ్డి, హర్ష పాల్గొన్నారు.
ఖమ్మంలో వెల్లువెత్తిన మద్దతు
ఖమ్మం : విజయమ్మ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఫీజు దీక్షకు మద్దగా ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. వైఎస్‌ఆర్ సీపీ పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షులు గోలి అనూబ్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్ధులు దీక్షలో కూర్చున్నారు. వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధులు నిరంజన్‌రెడ్డి, బొబ్బిలి భరత్‌చంద్ర, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ తోట రామారావు, మైనారిటి విభాగం జిల్లా కన్వీనర్ అక్రమ్, యువజన విభాగం పట్టణ కన్వీనర్ దేవభక్తిని కిషోర్, పట్టణ కన్వీనర్ అయుబ్‌ఖాన్‌లు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు తిరపతినాయక్, రవినాయక్, హతీరాం, ఎన్.రవి, బాలు, ఎస్.కె. హుస్సేన్, ప్రసాద్, కె. రమేష్, కె. సురేష్ పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని పలువురు నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు. విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఐలూరి మహేష్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు జమలాపురం రామకృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొన్న విద్యార్థులకు సాయంత్రం 5గంటలకు వైఎస్‌ఆర్ సీపీ పట్టణ కన్వీనర్ అయుబ్‌ఖాన్ నిమ్మరసం అందించి దీక్షను విరమింపచేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ లక్ష్మీపార్వతికి అందజేశారు.
సారపాకలో...
బూర్గంపాడు: సారపాకకు చెందిన ఎస్వీ జూనియర్ కాలేజి, శ్రీరామభద్ర ఐటీఐ విద్యార్థులు స్థానికంగా దీక్షలు చేపట్టారు. మొత్తం 45 మంది విద్యార్థులు ఈ దీక్షలో కూర్చున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బిజ్జం వెంకటేశ్వరరెడ్డి ఈ దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీ ట్రేడ్ యూనియన్ నాయకులు, పార్టీ నాయకులు బిజ్జం అశోక్‌రెడ్డి, మారం పూర్ణచంద్రారెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, ఆవుల రమణారెడ్డి, యారం చిన్నశివారెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, చిలకల చిట్టిబాబు, పానెం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
పినపాకలో ర్యాలీ...
పినపాక : పినపాక మండల కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. డివిజన్ నాయకుడు సాధిక్ సోహైల్, మండల కన్వీనర్ తోలెం అర్జయ్యల నాయకత్వంలో విద్యార్థులు స్థానిక జూనియర్ కళాశాల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థి సంఘ నాయకులు మహేష్, నవీన్ కుమార్, శివ, చంటి, అశోక్, ప్రశాంత్, రాము పాల్గొన్నారు.
చర్లలో: చర్లలోని బస్టాండ్ సెంటర్‌లో ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రెండురోజుల రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షా శిబిరాన్ని ఆ పార్టీ నాయకులు చుక్కబొట్ల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రామగిరి యాకయ్య, బీజీ సెల్ జిల్లా నాయకులు నీలి ప్రకాశ్, మహిళా నాయకురాలు పొడుపుగంటి సమ్మక్క మాట్లాడారు. తొలిరోజు దీక్షలో ఆ పార్టీ నాయకులు జవ్వాది సతీష్‌కుమార్, బసవ శ్రీనివాసరావు, కోటిపల్లి సోమయ్య, కాళ్ల క్రిష్ణ, కాశీవిశ్వనాధ్, విద్యార్థి విభాగం నాయకులు మాగంటి నాగేంద్ర, బీరబోయిన వివేకానంద, పిట్టా నాగేంద్ర, ఇర్పా అనీల్, కొమరం ముత్యాలు, కొప్పుల రవి, పెదబోయిన సురేష్, కొమరం రవీంద్ర, జమ్ముల కామేష్, గేదెల కృష్ణమూర్తి, పులగడపు కృష్ణకుమారి, రావులపల్లి లక్ష్మి, తోటమళ్ల అనుసూర్య పాల్గొన్నారు.
కారేపల్లిలో కదం తొక్కిన ఇంజనీరింగ్ విద్యార్థులు: వైయస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు కారేపల్లిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కారేపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి సినిమా హాల్ సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ వేములపల్లి కృష్ణమూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన తహశీల్దార్ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రావూరి శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ క మిటీ సభ్యులు ఇమ్మడి తిరుపతిరావు, నాయకులు మండెపూడి సత్యనారాయణ, వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం మండల కన్వీనర్ గంగరబోయిన మురళీ, విద్యార్థులు అమీర్, శ్రీను, నవీన్ పాల్గొన్నారు.
101 కొబ్బరికాయలు కొట్టి మద్దతు
నెల్లూరు: ఫీజు రాయితీ పథకాన్ని యథాతథంగా అమలు పరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు సంఘీభావం తెలుపుతూ విద్యార్థులు నగరంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఫీజు దీక్ష విజయవంతం కావాలంటూ తొలుత టౌన్‌హాల్ వద్ద ఉన్న వినాయకునిగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టారు. అనంతరం విద్యార్థులు చెలగపార, గడ్డపార, తట్టలు పట్టుకుని గుడి నుంచి బయలు దేరి వీఆర్సీ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వరకు తమ నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఫీజు పథకాన్ని యథావిధిగా కొనసాగించకపోతే తమ చదువులకు స్వస్తి చెప్పి కూలి పనులకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డి, కర్తం ప్రతాప్‌రెడ్డి, సన్నపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మంగళపుడి శ్రీకాంత్‌రెడ్డి, సూరి పాండురంగారెడ్డి, వెంకటేష్, ఎస్‌కే షబ్బీర్, దత్తు, సిరాజ్, సురేష్, మోహన్, మల్లికార్జునగౌడ్, ఉదయ్‌కుమార్, మౌలానా, జిలాని, ఫయాజ్, చెన్నయ్య, కదిరి సూరి, నాగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, కాజా, కోటేశ్వరరావు, ఈదెల ధనూజరెడ్డి, సుగుణ, హసీనా పాల్గొన్నారు. ఫీజుదీక్షకు మద్దతుగా మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
అనంతరం విద్యార్థి సంఘ నాయకులు కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. వెబ్ ఆప్షన్ల కౌన్సెలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులను 4వ నగర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఆర్మూర్‌లో దీక్ష
ఆర్మూర్ టౌన్: విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్సుమెంట్‌గా ఇవ్వాలని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో చేపట్టిన ఫీజు పోరు దీక్షకు సంఘీభావంగా ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థుల కు ఉన్నత విద్య కలగా మిగలకూడదన్న సదాశయంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. విజయమ్మ చేపట్టిన ఫీజు పోరు దీక్షకు మద్దతుగా ఆర్మూర్‌లో నిర్వహిస్తున్న దీక్షకు వేలాది మంది విద్యార్థులు సంఘీభావం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్, మండల కన్వీనర్ జీవన్‌రెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ పండిత్ ప్రేమ్, నాయకులు దీపక్‌రెడ్డి, నరేందర్, చింటు, గంగారెడ్డి, సుభాష్ సత్యనారాయణ గౌడ్, స్వామి, మాజిద్, బాల్‌రెడ్డి, నర్సయ్య, లక్ష్మణ్, రాజు, రవికాంత్‌రెడ్డి, చెన్న రవికుమార్, భీమా గౌడ్, శ్యాంరావు, లింబాద్రి, ఇంతియాజ్ అలీ, అక్బర్, జబ్బర్, మోహన్‌రెడ్డి, చిన్నారెడ్డి, సదాశివ్‌రెడ్డి, వెంకట్ రాజ్, జాహెద్, రామకృష్ణ హజారే, దేవేందర్, ధర్మాజీ, రాజేశ్వర్, ప్రసాద్, రామ్‌జానే తదితరులు పాల్గొన్నారు.
తరలివచ్చిన అభిమానం
హైదరాబాద్: ఇందిరాపార్కు చౌరస్తా అభిమాన సంద్రమైంది. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తున్న సర్కారు చర్యను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ‘ఫీజు దీక్ష’కు సంఘీభావంగా విద్యార్థి లోకం కదలివచ్చింది. గురువారం ధర్నాచౌక్ వైఎస్సార్ నామస్మరణతో హోరెత్తిపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే కాక రాష్ట్రం నలుమూల నుంచి విద్యార్థులు, అభిమానులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీగా తరలివచ్చారు. సాయంత్రానికి విజయమ్మను కలుసుకునేందుకు యువత బారులు తీరింది. విజయమ్మను అభినందించేందుకు విద్యార్థులు పోటీ పడటంతో వారిని అదుపుచేసేందుకు సేవాదళం కార్యకర్తలు కష్టపడాల్సి వచ్చింది.
విజయమ్మకు మద్దతు వెల్లువ
‘పెద్ద చదువులు..పేదల హక్కు’ అంటూ వైయస్ ప్రవేశపెట్టిన అత్యున్నత పథకాల్లో ఒకటైన ఫీజు రియింబర్సుమెంట్‌ను ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాల్సిందేనని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. విజయమ్మకు వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ బధిరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు నస్రీన్, ప్రధాన కార్యదర్శి ఖుర్ధుష్‌ఖాన్ ఆధ్వర్యంలో బధిరులు మద్దతు ప్రకటించారు. మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.ఎల్.మల్లయ్య, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు తన్నీరు ధర్మరాజు, నాయకులు కృష్ణయ్య, ఈబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, అఖిల భారత రెడ్డి సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో కుల ప్రతినిధులు ప్రదర్శనగా తరలి వచ్చి విజయమ్మను కలిశారు. వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో వికలాంగులు భారీ సంఖ్యలో వచ్చి విజయమ్మకు మద్దతు తెలుపుతూ వినతిపత్రం ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, బీసీ విద్యార్థి ఐక్యవేదిక నాయకులు సాంబశివగౌడ్, బిశ్వా రవిందర్ ఆధ్వర్యంలో వర్సిటీ విద్యార్థులు దీక్షకు హాజరయ్యారు. తెలంగాణ దళిత సంఘాల రాష్ర్ట చైర్మన్ బత్తుల చంద్రమౌళి , సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి బోర సుభాష్ సంఘీభావం తెలిపారు.
విజయమ్మ దీక్షకు సంఘీభావం
నరసన్నపేట: హైదరాబాద్‌లో చేపట్టిన రెండు రోజుల దీక్షకు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం తెలిపారు. సత్యవరం జంక్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు మాట్లాడుతూ ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విజయమ్మ రెండు రోజుల దీక్ష చేపట్టడం పేదల సంక్షేమంపై పార్టీ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నదో స్పష్టం చేస్తోందని అన్నారు. నరసన్నపేట నియోజకవర్గంతోపాటు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పార్వతీపురం: పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీపురంలో దీక్షలు చేపట్టారు. వైయస్‌ఆర్ విగ్రహం వద్ద ఆ పార్టీ కో-కన్వీనర్ ఆర్‌వీఎస్ కుమార్, పట్టణ యువజన విభాగం కన్వీనర్ మజ్జి వెంకటేశ్, పార్టీ నాయకుడు సురగాల ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ఫీజు దీక్ష చేపట్టారు. ముందుగా మహానేత వైయస్‌ఆర్ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద నినాదాలు చేశారు.
గజపతినగరం : విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు మద్దతుగా గురువారం ఇక్కడ జాతీయ రహదారి వద్ద దీక్షలు  చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు వైయస్‌ఆర్ సీపీ నాయకుడు ఎస్.పెద్దినాయుడు దంపతులు సహకరించారు. విజయమ్మ దీక్షకు సంఘీభావంగా దీక్షలు చేపట్టినందుకు అభినందించారు.
ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరశన
ఏలూరు: పథకాన్ని యథాతథంగా కొనసాగించే వరకూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని పార్టీ సీనియర్ నేత డాక్టర్ దిరిశాల వరప్రసాద రావు స్పష్టం చేశారు. విజయమ్మ ఫీజు దీక్షకు సంఘీభావంగా ఆ పార్టీ యువజన విభాగం నాయకులు కాకర్ల రాజేష్ కుమార్, యీవని భాస్కర్ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే దీక్షా శిబిరాన్ని గురువారం డాక్టర్ దిరిశాల ప్రసాదరావు ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులకు దండలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షను సాయంత్రం పీవీ రావు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు.  విజయమ్మ హైదరాబాద్‌లో చేపట్టిన ఫీజు దీక్షకు ఆ పార్టీ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఊదరగొండి చంద్రమౌళి, తలారి వెంకట్రావు, ఎంఎస్‌రెడ్డి సందర్శించారు. ప్రభుత్వం దిగి వచ్చి ఫీజు పథకాన్ని యధావిధిగా కొనసాగించేలా నిర్ణయం ప్రకటించే వరకూ పార్టీ నాయకత్వం చేసే పోరాటాలకు మద్దతునిస్తూ నాయకుల వెన్నంటే ఉంటామని ప్రకటించారు.      

Back to Top