విజయమ్మ దీక్షకు పెరుగుతున్న సంఘీభావం

హైదరాబాద్‌, 6 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న కరెంట్‌ సత్యాగ్రహానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ప్రజలపై మోయలేని విద్యుత్‌ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వం, విద్యుత్‌ కోతలకు నిరసనగా వీరంతా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శనివారం ఐదవ రోజున కొనసాగుతున్నది. కాగా, కుషాయిగూడ నుంచి వేద పండితులు దీక్షాస్థలికి వచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు.

మరో పక్కన, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య దీక్ష చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పరామర్శించారు.

కరెంట్ సత్యాగ్రహానికి మద్దతుగా దీక్ష‌లు:
కాగా, కరెంట్ సత్యాగ్ర‌హ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని ఇతర అనేక పట్టణాల్లో కూడా దీక్షలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు చేపట్టిన నిరవదిక నిరాహార దీక్ష శనివారం 3వ రోజుకు చేరింది. నిరవధిక నిరాహార దీక్షలో ముర్ల రమేష్, మానె రామకృష్ణ, నవాబు పాల్గొన్నారు. మరో పక్కన విశాఖపట్నం, గుంటూరులలో కూడా నివరధిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

తాజా ఫోటోలు

Back to Top