విజయమ్మ దీక్షకు జూలకంటి అభినందన

హైదరాబాద్, 04 ఏప్రిల్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి  వైయస్ విజయమ్మ ఎన్నో బాధలు భరిస్తూ కూడా విద్యత్తు చార్జీల పెంపునకు నిరసనగా నిరవధిక దీక్షకు పూనుకోవటం అభినందనీయమని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రశంసించారు. వామపక్షనేతలు గురువారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేల దీక్షకు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా జూలకంటి మాట్లాడుతూ ప్రజల తరపున ఏ పోరాటం చేసినా బాసటగా నిలుస్తామన్నారు. ప్రజలపై కిరణ్ సర్కార్ భరించలేని భారం వేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ సర్కార్పై తిరగబడక తప్పదని జూలకంటి అన్నారు.

Back to Top