మంగళవారం నుంచి తెలంగాణలో విజయమ్మ పర్యటన

హైదరాబాద్ 25 జూన్ 2013:

 స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తారు.  మంగళవారం మెదక్, 26న నల్లగొండ, 27న ఖమ్మం, 28న రంగారెడ్డి, 29న మహబూబ్‌నగర్, 30న కరీంనగర్, జూలై 1వ తేదీన ఆదిలాబాద్, 2న నిజామాబాద్, 3న వరంగల్ జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ సందర్భంగా జరిగే సభలకు పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.

Back to Top