చంద్రబాబూ.. ఆ అప్పు గోడలపై రాసే ధైర్యముందా?


 హైదరాబాద్‌: ట్విటర్‌ వేదికగా మరోసారి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ఎంపీ విజయసాయి రెడ్డి  మండిపడ్డారు. తలసరి ఆదాయంలో ఏపీ నంబర్‌వన్‌ అని, గ్రామ సీమలు వెలిగిపోతున్నాయంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘తలసరి ఆదాయంలో ఏపీ దేశంలోనే నెంబర్‌ వన్‌ అంట. గ్రామ సీమలు వెలిగిపోతున్నాయట. ఈ సత్యాన్ని గోడ రాతల ద్వారా ప్రచారం చేయాలట. నాలుగున్నరేళ్లలో చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పుల వలన ప్రతీ పౌరుడి తలపై ఎంత అప్పు చేరిందో కూడా గోడ రాతల ద్వారా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా’ అని సూటిగా ప్రశ్నించారు. గత కొంతకాలంగా చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తోన్న తప్పులను సోషల్‌ మీడియా ద్వారా విజయసాయి రెడ్డి ఎండగడుతున్న సంగతి తెల్సిందే.


Back to Top