విధి సినిమా పోస్ట‌ర్ విడుద‌ల‌విజ‌య‌న‌గ‌రం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌ను విధి సినిమా టీం స‌భ్యులు శ‌నివారం క‌లిశారు. ఈ మేర‌కు సినిమా పోస్ట‌ర్‌ను జ‌న‌నేత చేతుల మీదుగా విడుద‌ల చేయించారు. జబర్దస్త్‌ టీమ్‌ సభ్యులు శాంతి, వినోద్‌లు వైయస్‌ జగన్‌తో క‌లిసి కొంత దూరం పాద‌యాత్ర చేసి సంఘిభావం తెలిపారు.  వైయస్‌ జగన్‌తో కలిసి అడుగు వేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. కాగా, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహ‌న్ రెడ్డికి టాలీవుడ్ నటుల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ నటుడు జగన్ పాదయాత్రకు మద్దతు ఇచ్చారు.  ఇప్పటికే పోసాని మురళీకృష్ణ, పృథ్వీ, కృష్ణుడు,  ఫిష్ వెంక‌టేష్‌ తదితర సినీ నటులు ఇప్పటికే జగన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా, మరో సినీ నటుడు ఫిష్ వెంకటన్ జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు.   
Back to Top