రాజధాని నిర్మాణం పేరుతో రాబంధుల రాజ్యం..!

హైదరాబాద్ః రాజధాని నిర్మాణం పేరుతో రాబంధుల రాజ్యం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతి ద్వారా సింగపూర్ సంస్థలకు వేల ఎకరాలు కట్టబెట్టడం వెనుక మతలబేంటో  చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ చంద్రబాబు తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో కడుతున్నది స్వదేశీ రాజధానా లేక విదేశీ రాజధానో చెప్పాలని ఆమె  చంద్రబాబును ప్రశ్నించారు. 

బహుళ పంటలు పండే 35 వేల ఎకరాలను రైతుల వద్ద నుంచి బలవంతంగా గుంజుకున్నారు. మరో 50 వేల ఎకరాల ఫారెస్ట్ భూములు తీసుకుంటున్నారు. వేలాది ఎకరాలను సింగపూర్ సంస్థలకు అప్పజెప్పి అక్కడ మీరెలాంటి లబ్ధి పొందుతున్నారని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి రాజధాని భూముల వ్యాపారం ఎలా చేయాలని ఆరాటపడుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. 
Back to Top