వరుస బాంబు పేలుళ్లపై విజయమ్మ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, 21 ఫిబ్రవరి 2013: హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస బాంబు పేలుళ్ళ ఘటనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయానక దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు శ్రీమతి విజయమ్మ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘాతుక చర్యను ఆమె ఖండించారు. బాంబు పేలుళ్ళ కారణంగా క్షతగాత్రులై వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలను నెలకొల్పడంలో ప్రజలంతా సహకరించాలని శ్రీమతి విజయమ్మ కోరారు. బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
Back to Top