వర్షాలు పడకపోవడానికి బాబే కారణం

–అక్కాచెల్లెమ్మలు కన్నీరు పెట్టడం రాష్ట్రానికే అరిష్టం
–ప్రశ్నించకపోతే ఎన్నికలకు ముందు కారు ఇస్తాం..కిలో బంగారం ఇస్తామంటారు
–నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి
–బాబులా నా వద్ద డబ్బులు లేవు
– నాన్నగారు నాకిచ్చిన పెద్ద కుటుంబమే నా ఆస్తి
–దెయ్యాలతో లౌక్యంగా ఉండండి
–ధర్మం, న్యాయానికి ఓటు వేయండి.

నంద్యాల: చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మోసం చేయడంతో ఆడబిడ్డలు కన్నీరు పెడుతున్నారని, అందుకే వర్షాలు కురవడం లేదని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు. అభివృద్ధి అంటే ప్రతి పేద వాడి గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవడం, ప్రతి ఇంట్లో చనిపోయిన తరువాత ఫోటో పెట్టుకోవడమే అభివృద్ధి అని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. ఆదివారం నంద్యాల పట్టణంలో ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న వైయస్‌ జగన్‌ సాయంత్రం ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉప ఎన్నికలో టీడీపీ చేస్తున్న అక్రమాలు, అరాచకాలపై నిప్పులు చెరిగారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే.. ఏ కథ చదివినా మనం చెప్పేది∙రాముడు మంచి వాడు, రాక్షసుడు చెడ్డవాడు అని చెబుతాం. మంచి  చేసే వాడు మంచివాడు, అన్యాయం చేసేవాడిని దుర్మార్గుడు అని అంటాం. అన్యాయం చేసేవాడిని రావణుడు, రాక్షసుడు అంటాం. సీఎం పదవి కోసం ఎన్నికలకు ముందు చంద్రబాబు తాను ఏం మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడవటం ధర్మమేనా? ఈ మాదిరిగా అన్యాయం చేసేవారిని నిలదీయకపోతే రేపొద్దున ఏ రాజకీయ నాయకుడైనా మీ వద్దకు వచ్చి ప్రతి ఇంటికి కారు కొనిస్తానంటారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. మోసం చేసే వారిని ప్రజలు కాలర్‌ పట్టుకొని అడుగుతారన్న భయం రాజకీయ నాయకులకు ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉంటుంది. 
ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
బాబు ఎన్నికల సమయంలో ఊరువాడా అదరగొట్టాడు. రైతుల రుణాలు బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రైతులకు ఇవ్వాల్సిన సున్నావడ్డీ, పావలా వడ్డీ రుణాలు అందడం లేదు. ఓట్ల కోసం అక్క చెల్లెమ్మలను చంద్రబాబు వదిలిపెట్టలేదు. అక్కచెల్లెమ్మల కంట్లో నీరు తిరిగితే ఇంటికి అరిష్టం. ఈ రోజు వర్షాలు పడలేదంటే కారణం చంద్రబాబే. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇవాళ మోసం చేశాడు. చదువుకుంటున్న చిన్న పిల్లలను సైతం మోసం చేశాడు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాల్టికి ప్రతి ఇంటికి రూ.76 వేలు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నారు. ఇల్లు కట్టిస్తామన్నారు. కనీసం ఒక్క ఇల్లైనా కట్టించారా? నేను అడిగిన ఏ ప్రశ్నకు కూడా లేదు..లేదు అన్న సమాధానం వస్తోంది. పదవి కోసం ఇన్నిన్ని మోసాలు చేస్తున్నారు. కర్నూలుకు వచ్చి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా అబద్ధాలు అడే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. కర్నూలులో ఏయిర్‌పోర్టు, త్రిపుల్‌ ఐటీ, పుడ్‌పార్క్, మైనింగ్‌ స్కూల్‌ అన్నారు. కేసీ కెనాల్‌ స్థిరీకరణలో భాగంగా గుండ్రేవుల ప్రాజెక్టును బాగు చేస్తానన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఒక్క మాట చెబితే మనం అంతా కూడా అవుతుందని అనుకుంటాం. అయితే చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ  ఒక్కటి నెరవేరలేదు. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి సామాజిక వర్గంలో ఇవాళ అలజడి సృష్టించారు. 

ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు
చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని వైయస్‌ జగన్‌ అన్నారు.
నంద్యాల ఉప ఎన్నికల వేళ ఇవాళ టీడీపీ నేతలందరూ కూడా నంద్యాల నడిరోడ్డుపై తిరుగుతూ మళ్లీ మోసాలు, అబద్ధపు హామీలు ఇస్తున్నారు. అభివృద్ధి చేస్తున్నామని డబ్బాలు కొడుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటీ? రెండు కిలోమీటర్లు ఈ పక్కా, ఆ పక్కా బిల్డింగ్‌లు పగులగొడితే అభివృద్ధా? రోడ్డు విస్తరణ అన్నది మాములుగా జరిగే ప్రక్రియ. అయితే చంద్రబాబు ఇక్కడ చేసింది ఏంటో తెలుసా? మూడేళ్లపాటు ఇక్కడ రోడ్డు విస్తరణ గురించి పట్టించుకోలేదు. రోడ్డు విస్తరణ సమయంలో బాధితులతో మాట్లాడి వారిని ఒప్పించాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఎడాపెడా బిల్డింగ్‌లో కొట్టుకుంటూ పోతున్నారు. బాధితులకు ముస్టి వేసినట్లు రూ.18000 ఇస్తారట. ఇల్లులు కట్టిస్తానని మరో అబద్ధం అడుతున్నారు. 300 అడుగల ఇళ్లు కట్టిస్తానంటున్నారు. అడుగుకు వెయ్యి రూపాయలు అవుతుంది. పేద వాడికి రూ.6 లక్షల నెత్తిన వేసి ఇల్లు కడుతా అంటున్నారు. బినామీ కంట్రాక్ట్‌కు కట్టబెట్టి కమీషన్లు తీసుకుంటున్నారు. 

పులివెందుల తరహాలో నంద్యాల అభివృద్ధి
పులివెందుల తరహాలో నంద్యాలను అభివృద్ధి చేస్తానని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధి అంటే చనిపోయిన తరువాత కూడా ఇంట్లో ఫోటో పెట్టుకోవడమే అన్నారు. నంద్యాలను బాగు చేసే బాధ్యత నాకు విడిచిపెట్టండి. మార్పుకు నాందీ నంద్యాల కావాలి. పులివెందుల తరువాత నంద్యాలను అంత అభివృద్ధి చేస్తా. బాబులా నా వద్ద సీఎం పదవి లేదు. పోలీసుల బలం లేదు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించే మీడియా నా వద్ద లేదు. డబ్బులు కూడా నా వద్ద లేదు. నాకున్న ఆస్తి ఏంటో తెలుసా? వైయస్‌ రాజశేఖరరెడ్డి తాను చనిపోతు నాకిచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబమే అని గర్వంగా చెబుతా. నాన్నగారు చేసిన మంచి, ఆ సంక్షేమ పథకాలు ఇవాల్టి వరకు ప్రతి గుండెలో బతికే ఉన్నాయి. అవే నా ఆస్తి. వైయస్‌ జగన్‌ అన్న వ్యక్తి మాట తప్పుడు. చెప్పింది చేస్తాడు అన్న విశ్వసనీయతే నా ఆస్తి. నవరాత్నాలు ప్రకటించారు. ప్రతి ఇంటిని బాగుచేస్తాడన్న నమ్మకమే నా ఆస్తి. అవినీతి సొమ్ముతో చంద్రబాబు మీ వద్దకు వచ్చి దేవుడి ఫోటో మీ చేతుల్లో పెట్టి ప్రమాణం చేయిస్తారు. ఏ దేవుడు కూడా పాపం చేయమని చెప్పడు. ఆ పని చేసేవి దయ్యాలు మాత్రమే. రాబోయే రోజుల్లో మళ్లీ ఆ దయ్యాలే మీ వద్దకు వస్తాయి. అప్పుడు మీ ఆందరికి ఒకే ఒక సలహా చెబుతున్నా..కళ్లు మూసుకొని దేవుడిని తలచుకొని ధర్మానికే ఓటు వేస్తామని చెప్పండి. ఇవాళ మనం వేసే ఈ ఓటు మూడేళ్ల పాటు చంద్రబాబు చేసిన మోసాలకు, అన్యాయలకు, అధర్మానికి వ్యతిరేకంగా వేస్తున్నాం. మార్పుకు నంద్యాలే నాంది కావాలి. మీ అందరి చల్లని దీవేనలు, ఆశీస్సులు శిల్పా మోహన్‌రెడ్డిని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దీవించాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.

తాజా వీడియోలు

Back to Top