రంగాను విమర్శిస్తే ఊరుకోం

విజయవాడః వంగవీటిని రంగాను విమర్శిస్తే ఊరుకునేది లేదని వంగవీటి రాధా కృష్ణ అన్నారు. గౌతం రెడ్డి వ్యాఖ్యలతో వంగవీటి రంగా అభిమానులు బాధపడ్డారని అన్నారు. గౌతంరెడ్డి పట్ల పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. అన్ని పార్టీల్లో వంగవీటి రంగాను  అభిమానించేవాళ్లున్నారని పేర్కొన్నారు. పోలీసులు  ఓ మాజీ శాసనసభ్యురాలు, మహిళ అని కూడ చూడకుండా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లడం తప్పని అన్నారు. సదరు పోలీస్ ఆఫీసరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు.

Back to Top