<p style="" margin-top:0in=""><strong>హైదరాబాద్: </strong>ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన వంచన పై గర్జన దీక్షను ఈ సారి ఢిల్లీ వేదికగా నిర్వహిస్తోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో , రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తానికి తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నెల 27 వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఈదీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్షను నిర్వహించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈకార్యక్రమంలో పార్టీ పార్లమెంటు సభ్యులు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు, జిల్లాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. </p>