వలసల భయంతోనే బాబు పాదయాత్ర: చెవిరెడ్డి

తిరుపతి: పార్టీ ఎమ్మెల్యేలు వలసలు పోతారన్న భయంతోనే చంద్రబాబు నాయుడు అతి కష్టంమీద పాదయాత్ర సాగిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతిలో విలేకరులతో  ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు నమ్మరనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ఆహ్వానించదగిందే! కానీ తెలుగు పూర్తిగా రాని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలుగు ఎవరు నేర్పుతారో చెప్పాలని పేర్కొన్నారు. అన్న ఆశయాలు.. తండ్రి ఆకాంక్ష కోసం షర్మిల పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక మహిళ 3 వేల కిలోమీటర్లు పాదయాత్రకు సిద్ధమవడం ప్రశంసనీయమన్నారు. 

వైయస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేయండి: కుడుపూడి

రాజమండ్రి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యేందుకు యువత కృషి చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి చెప్పారు. ఆదివారం రాజమండ్రి 50 వ డివిజన్‌లో 200 మంది వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. వారిని చిట్టబ్బాయి పార్టీ కండువాలు కప్పి సాదరంగా అహ్వనించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్, ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యద ర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, పార్టీ ప్రత్యేక ఆహ్వానితులు ఆదిరెడ్డి అప్పారావు, మిండగుదిటి మోహన్, మార్గాని రామకృష్ణ గౌడ్, జిల్లా సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గారపాటి ఆనంద్, నగర సేవాదళ్ అధ్యక్షుడు బిల్డర్ చిన్న పాల్గొన్నారు.
సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో....
సామర్లకోట: స్థానిక రెండో వార్డు గణేష్ కాలనీలో 150 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తోట సుబ్బారావు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైయస్ ఆశయాల సాధనకు జగన్ పక్షాన ఆయన సోదరి షర్మిల చేయనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాలిక చంటిబాబు, సల్లూరి కల్యాణ్ లింగం శివ, పిట్టా సత్యనారాయణ, సరుగుల శ్రీను తదితరుల నాయకత్వంలో 150మంది పార్టీలో చేరారు. పట్టణ మహిళావిబాగం కన్వీనర్ కానేటి ఎలిజబెత్‌రాణి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ, యార్లగడ్డ జగదీష్, రెడ్డి లక్ష్మి, మాజీ కౌన్సిలర్లు నేతల హరిబాబు, పితాని కృష్ణ, పార్టీ నాయకులు పుట్టా సూరిబాబు, పోతుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Back to Top