వైయస్ రుణం తీర్చుకునేందుకే జగన్‌కు మద్దతు

గుంటూరు : మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునేందుకే ఆయన కుమారుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి విద్యార్థులు అండగా నిలుస్తున్నారని వైయస్‌ఆర్‌సిపి సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. విద్యార్థుల బాగు కోసం వైయస్‌ కృషి చేసేనందుకే వారు కృతజ్ఞతతో ఉన్నారన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు తరిమి కొడతారని రాంబాబు హెచ్చరించారు. గుంటూరు పట్నంబజారులోని అంబేద్కర్ భవ‌న్‌లో శనివారం జరిగిన వైయస్‌ఆర్‌సిపి విద్యార్థి విభాగం నగర కన్వీన‌ర్‌ పానుగంటి చైతన్య ప్రమాణస్వీకారోత్సవానికి అంబటి హాజరయ్యారు.‌ చైతన్యతో పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు.

విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు కుప్పకూలిపోక తప్పదని అంబటి హెచ్చరించారు. శ్రీ జగన్‌పై విమర్శలు చేస్తే ప్రజలు సహించబోరన్నారు. ఈబీసీ ఉపకార వేతనంతో చంద్రబాబు విద్యాభ్యాసం చేసిన విషయాన్ని ఆయన ఉటంకించారు. చంద్రబాబు తండ్రికి కేవలం రెండెకరాల పొలం మాత్రమే ఉండేదని, అలాంటి చంద్రబాబు ఇప్పుడు వేలాది కోట్లకు ఎలా పడగలెత్తారని అంబటి ప్రశ్నించారు.

ఈ నెల ఆరవ తేదీ నుంచి శ్రీ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానంను పునఃప్రారంభిస్తారని అంబటి చెబుతూ, ఆమె పాదయాత్రను జయప్రదం చేయాలని విద్యార్థు, ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో జిల్లాలో జరిగే పాదయాత్రలో విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ పూనూరి గౌత‌మ్‌రెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్‌, పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి‌, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహ‌ర్‌ నాయుడు, యువజన విభాగం నగర కన్వీనర్ నసీ‌ర్ అహ్మ‌ద్, విద్యార్థి విభాగం నగర కన్వీనర్ పానుగంటి చైతన్య‌, పార్టీ వివిధ విభాగాల కన్వీనర్లు గులాంరసూల్, బండారు సాయిబాబు, నర్సిరెడ్డి తదితరులు ప్రసంగించారు.
Back to Top