వైయస్ రాజారెడ్డికి విజయమ్మ నివాళులు

పులివెందుల, 23 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తండ్రి శ్రీ వైయస్‌ రాజారెడ్డి
వర్థంతిని గురువారం నిర్వహించారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో ఘనంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు
శ్రీమతి వైయస్‌ విజయమ్మ, వైయస్ వివేకానందరెడ్డి, కుటుంబసభ్యులు, దివంగత
మహానేత డాక్టర్ వైయస్ఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున
పాల్గొన్నారు. శ్రీ వైయస్‌  రాజారెడ్డి ఘాట్‌ వద్ద శ్రీమతి వైయస్‌ విజయమ్మ
పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

షర్మిల నివాళులు: ఉంగుటూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల తన తాతగారైన శ్రీ వైయస్ రాజారెడ్డికి ఘన నివాళులర్పించారు. శ్రీ రాజారెడ్డి చిత్రపటానికి పూలమాల వేశారు.

Back to Top