'వైయస్ మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలి'

గోపాలపురం (పశ్చిమగోదావరి జిల్లా) : దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మృతిపై‌ ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. గోపాలపురంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‌హెలికాప్టర్ ప్రమాదానికి కారణం భద్రతా లోపమా, ప్రభుత్వ ‌నిర్లక్ష్యమా అని ఆయన ప్రశ్నించారు.

బేగంపేట విమానాశ్రయం‌లో ఇటీవలే జరిగిన అగ్నిప్రమాదంలో సిఎం ప్రయాణించే అగస్టా హెలికాప్టర్ కాలి బూడిదైన ఘటనను ప్రభుత్వం భద్రతా లోపంగా పరిగణించడం పలు అనుమానాలకు తావిస్తోందని బాలరాజు చెప్పారు. మహానేత వైయస్ ప్రయాణించిన హెలికాప్టర్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఏం మాట్లాడారనేది ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే తానేటి వనిత, కూసం రామ్మోహనరెడ్డి, కాండ్రేకుల శ్రీహరి, వడ్లమూడి రాజేంద్రప్రసాద్, దుగ్గిరాల రమేష్‌బాబు, పఠాన్ అ‌న్వర్ బాషా, ఎస్‌కే వలీ, కప్పల వరలక్ష్మి, గన్నమని జనార్దన్, చాపల మేరీ, జుజ్జవరపు అన్నవరం, వారపు శశికుమా‌ర్, ముప్పిడి సంప‌త్‌కుమార్, ముల్లంగి శ్యాంసుందర్‌రెడ్డి, వింత ప్రసాద్‌రెడ్డి, ముప్పిడి కోటేశ్వరరావు, చాపల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top