'వైయస్‌ఆర్‌ సిపి విజయ దుందుభి ఖాయం'

ఏలూరు: 
కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్ధితి వస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చివేసే సత్తా వైయస్ కాంగ్రెస్‌ పార్టీకి ఉందని పార్టీ నాయకురాలు కొండా సురేఖ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీయే విజయ దుందుభి మోగిస్తుందని ఆమె అన్నారు. స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా వైయస్‌ఆర్‌సిపికి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నాయని ఎద్దేవా చేశారు.


తెలంగాణ  ప్రజల విశ్వాసాన్ని టిఆర్‌ఎస్ కోల్పోయిందని‌ సురేఖ వ్యాఖ్యానించారు. తెలంగాణలో వైయస్‌ఆర్‌సిపికి ఉన్న ఆదరణ ఉపఎన్నికల్లోనే రుజువైందని ఆమె అన్నారు. కుట్ర పన్ని‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని జైలుకు పంపిన తరువాతే‌ శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ బాధ్యతలు చేపట్టారని కొండా సురేఖ చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top