వైయస్‌ఆర్‌సిపి బిసి లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

హైదరాబాద్ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బి.సి. విభాగం లోగోను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ మంగళవారం నాడు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బి.సి. విభాగం వెబ్‌సైట్‌ను కూడా ఆమె ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్‌, సీఈసీ సభ్యుడు కె.శివకుమార్, ఎస్సీ విభాగం కన్వీనర్ ‌నల్లా సూర్యప్రకాశ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బి.సి. విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 123 ‌బి.సి. కులాల ఐక్యతను ప్రతిబింబించే విధంగా ఈ ప్రత్యేక లోగోను రూపొందించినట్లు చెప్పారు. బి.సి.ల సంక్షేమం కోసం దివంగత మహేనేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తుందని చెప్పారు. బి.సి.లకు ఉపయోగపడే విధంగా రూపొందించిన తమ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ జీఓలు, ఇతర సమాచారం ఉంటుందని గట్టు వివరించారు.

తాజా ఫోటోలు

Back to Top