వైయస్ఆర్ సీపీలో 500 మంది చేరిక

జగ్గంపేట: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం మర్లావ గ్రామానికి చెందిన సుమారు ఐదొందల మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివిధ పార్టీలకు చెందిన గవరసాని రామస్వామి, కాతా రాము, కామన చంద్రరావు, రామకృష్ణ, కాతా తాతయ్య, గవరసాని పద్మరాజు, కాతా శంకరరావు తదితరులు పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి సమక్షంలో చేరారు. దివంగత నేత తోట గోపాలకృష్ణ తనయుడు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుబ్బారావు నాయుడు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.  వీరికి చిట్టబ్బాయి, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జిల్లా కో-ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారావు నాయుడు తదితరులు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కుడుపూడి ఆవిష్కరించారు. తమ కష్టాలను గట్టెక్కిస్తాడని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న నమ్మకంతో పార్టీలోకి చేరిన వారికి ఈ సందర్భంగా కుడుపూడి కృతజ్ఞతలు తెలిపారు. ఒక గ్రామం అంతా కలిసి పార్టీలో చేరడం పెద్దాపురం నియోజకవర్గంలోనే చూస్తున్నానన్నారు. దివంగత నేత గోపాలకృష్ణ సహకారంతోనే తాను జిల్లా కన్వీనర్ పదవిని చేపట్టానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నేతలు బొమ్మన రాజ్‌కుమార్, ఆదిరెడ్డి అప్పారావు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. 
కాట్రేనికోనలో..
కాట్రేనికోన : మండలంలోని దొంతికుర్రుకు చెందిన 50 మంది వైయస్ఆర్ సీపీలో చేరారు. గ్రామ నాయకుడు సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఈ చేరిక జరగ్గా పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గుత్తుల సాయి ఆహ్వానించారు. సత్యవాడ సత్య నారాయణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 
ఖమ్మం జిల్లాలో..
పెరికెగూడెం: ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ టీడీపీ ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీ లేదని వైయస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని పెరికెగూడెం, కొత్తూరు గ్రామాలకు చెందిన 500 మంది కార్యకర్తలు వైయస్ఆర్ సీపీలో చేరారు. వారికి డీఎన్నార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొమ్మిదేళ్లపాటు పాలనలో రైతుల జీవితాలతో ఆడుకున్న చంద్రబాబు ఇప్పుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. 
Back to Top