వైయస్ఆర్ పథకాలపై బంజారాల నృత్యాలు

ఖమ్మం:

 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు గిరిజనులు తమ సాంప్రదాయ నృత్యాలతో  స్వాగతం పలికారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు  చేరిక సందర్భంగా సోమవారం ఖమ్మం పట్టణానికి విచ్చేసిన విజయమ్మకు స్వాగతం పలికేందుకు ఏజెన్సీలోని చింతూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల నుంచి గిరిజన కళాకారులు వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను గుర్తుకు తె స్తూ వారు ఆలపించిన గీతాలు అందరినీ ఆలోచింపజేశాయి. కొమ్ము తలపాగాలను ధరించి రేలా పాటలు పాడుకుంటూ గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా తమదైన శైలిలో స్వాగతం పలికారు. జలగం పేరుతో ఉన్న దుస్తులను ధరించి బహిరంగ సభ వేదిక ముందు వారి చేసిన రేలా నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చండ్రుగొండ మండలానికి చెందిన మాజీ ఎంపీపీలు గుగులోతు మీనా,బాబూనాయక్ దంపతులు బాయి తమ సాంప్రదాయ బంజారా దుస్తులను విజ యమ్మకు బహుకరించారు. లంబాడాల అభివృద్ధికి పాటుపడిందే ఒక్క  రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని అందుకే ఆయనంటే తమ లంబాడాలకు ఎంతో అభిమానమని ఆ దంపతులు విజయమ్మతో చెప్పారు. తమ అభ్యున్నతి కోరే నేత మరణంతో ఏర్పడిన లోటు జగన్‌బాబు సీఎం అవ్వటం ద్వారా తీరాలంటూ గిరిజనుల కోరి కను విజయమ్మ ముందు ఆ దంపతులు ఉంచారు. విజయమ్మ ఆ ప్యాయంగా పలకరించటంతో ఆ దంపతులు ఉప్పొంగిపోయారు.

తాజా వీడియోలు

Back to Top